4
వాడేముందుగా 2 - 3 రోజులు నీటిని నిల్వచేయవలెను. ఇలా చేయడం వలన చేపలు మరియు ఇతర జాతుల జంతువులు గ్రుడ్ల నుంచి లార్వాలు వెలుపలికి వచ్చి హైపో క్లోరైట్ వలన చనిపోవును. బ్లీచింగ్ పౌడర్ను కలిపిన తరువాత ఏరేటర్స్ను ఉపయోగించి నీటిలో బాగా కలిసేటట్లుగా చేయవలెను.
* బ్లీచింగ్ పౌడర్ వాడిన కొద్ది రోజుల తర్వాత ద్రవరూపంలో ఉన్న ఎరువులను వాడవలెను. నీరు మరియు మట్టిని
పరీక్షించకుండా ఎరువుల మోతాదులను నిర్ణయించుకొనడం కష్టతరం కాబట్టి తక్కువ మోతాదులో రసాయన వేసి తర్వాత ఎరువులను పశువుల పేడ మొదలగు సేంద్రియ ఎరువులను వాడడం ప్రారంభించాలి. మొదటి విడత రసాయన ఎరువును వాడిన తర్వాత రెండవ మోతాదు ఎరువును వాడడానికి రెండు మూడు రోజులు ఆగాలి. తర్వాత తక్కువ మోతాదులలో రసాయన ఎరువులను వాడాలి. ఎరువులను వాడేముందుగా వాటిని నీటిలో బాగా కలపాలి.
ఎరువులు వాడిన వారం రోజుల తరువాత కూడా వృక్ష ప్లవక జీవులు అభివృద్ధి చెందని ఎడల మరల ఎరువులు వాడవద్దు. ఇటువంటి పరిస్థితులలో బాగా వృక్ష ప్లవక (ప్లాంక్టాన్) జీవులు అభివృద్ధి చెందిన, చెఱువు నీటిని ఇనాక్యులేషన్ పద్ధతి ద్వారా వృక్ష ప్లవక జీవులు అభివృద్ధి చెందని చెఱువులోనికి పంపుచేయవలెను.
రొయ్య పిల్లలను 100-200 పి.పి.ఎమ్. ఫార్మలిన్ ద్రావణములో ఒక గంట పాటు ఉంచినచో బలహీనంగా, అనారోగ్యంతోఉన్న పిల్లలు చనిపోవును. ఆ తరువాత మిగిలిన మంచి పిల్లలను చెఱువులో వదలవలెను. * రొయ్య పిల్లలను చెఱువు నీటితో ఎక్లమటైజేషన్ చేసిన
తరువాత చెఱువు అన్ని దిక్కుల లో వదలవలెను. * చెఱువులో వేసిన పిల్లల బతుకుదల శాతమును లెక్కించుటకు ఒక మీటరు పొడవు వెడల్పులు గల రెండు హాపాలను చెఱువులో వేరు వేరు చోట్ల ఉంచి 200 పిల్లలను వుంచి, 48 గంటల తరువాత జీవించి ఉన్న పిల్లలను lekkinchavalenu
No comments:
Post a Comment